Telangana SET | టీజీసెట్-2024 ఫలితాలు విడుదల
Telangana SET | టీజీసెట్-2024 ఫలితాలు విడుదల
మొత్తం1,884 అభ్యర్థులు మాత్రమే అర్హులు
వెబ్‌సైట్‌లో ఫలితాలు
Hyderabad : రాష్ట్రంలో తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్టు (టీజీసెట్ 2024) ఫలితాలను తాజాగా విడుదల అయ్యాయి. టీజీ సెట్ 2024 ప్రాథమిక కీ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం టీజీసెట్ ఫలితాలు విడుదల చేసింది. అభ్యర్థుల ఫలితాలు టీజీసెట్-2024 అధికారిక వెబ్‌సైట్‌లో విద్యార్థుల సౌకర్యం అందుబాటులో పెట్టారు. టీజీసెట్ పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 33,494 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 26,294 మంది పరీక్షలకు హాజరయ్యారు. అయితే విడుదలైన సెట్ ఫలితాల్లో కేవలం 1,884 మంది అభ్యర్థులు మాత్రమే అర్హత సాధించారు. ఫలితాలకోసం అభ్యర్థులు TGSET అధికారిక వెబ్సైట్ (www.telanganaset.org) లో చూసుకోవాలని సెట్ అధికారులు పేర్కొన్నారు. వెబ్‌సైట్‌కు లాగినై దరఖాస్తు నంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేయటం ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చన్నారు.
* * *
Leave A Comment